కత్తిరింపులు: ఉస్మానియా అగ్నికణం జార్జి రెడ్డి 40 వ వర్ధంతి
జార్జి రెడ్డి పి.డి.ఎస్.యు (ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్) విద్యార్ధి సంఘం నిర్మాత. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో విప్లవ విద్యార్ధి ఉద్యమాలకు ఆద్యుడు. క్యూబా విప్లవకారుడు ఎర్నెస్టో చెగువేరా స్ఫూర్తిని గుండెల నిండా నింపుకుని భారత పీడిత ప్రజల పక్షాన విద్యార్ధి ఉద్యమాల నిర్మాణానికి పూనుకున్న అగ్నికణం. ‘పుట్టుకతో వృద్ధులు’గా జీవించడానికి నిరాకరించి ‘పావన నవజీవన బృందావన నిర్మాతల’లో భాగం కావడానికి నిశ్చయించుకున్న స్ఫూర్తి ప్రదాత. యూనివర్సిటీ క్యాంపస్ లో మత దురభిమాన శక్తుల గూండాయిజాన్ని ఎదుర్కొని…
