తానింకా సోషలిస్టునే అంటున్న గ్రీకు ప్రధాని -కార్టూన్

చెయ్యాల్సిందంతా చేసిన గ్రీకు ప్రధాని జార్జి పపాండ్రూ తానింకా సోషలిస్టునే నని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నాడు. ఇప్పటికి ఐదు విడతలుగా అత్యంత కఠినమైన ప్రజా వ్యతిరేక పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేసిన పపాండ్రూ ఆరో విడత కోతలకు ప్రజల అనుమతి కావాలంటూ బయలుదేరాడు. గ్రీసు కోసం ఇ.యు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందంపైన గ్రీసు ప్రజల అనుమతి కోసం ‘రిఫరెండం’ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. మొదటి ఐదు విడత కోతలకు ప్రజల అనుమతి తీసుకోవాలని పపాండ్రూకి గుర్తు రాలేదు.…

గ్రీసు రెండో బెయిలౌట్‌కి ఇ.యు+ఐ.ఎం.ఎఫ్ అంగీకారం, గ్రీకులపై నడ్డి విరిగే భారం

“ఎద్దు పుండు కాకికి ముద్దు” అని సామెత. గ్రీసు అప్పు సంక్షోభం యూరప్‌లోని ధనిక దేశాల ప్రైవేటు బహుళజాతి గుత్త సంస్ధలకు సిరులు కురిపించబోతోంది. అదే సమయంలో గ్రీసు ప్రజలకు “పెనం మీదినుండి పొయ్యిలోకి జారిన” పరిస్ధితి దాపురిస్తోంది. గ్రీసు మరిన్ని పొదుపు చర్యలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, లేనట్లయితే రెండో బెయిలౌట్ ప్యాకేజి ఇచ్చేది లేదని నెలరోజుల నుండి బెదిరిస్తూ వచ్చిన ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు తాము కోరింది సాధించుకుని రెండో బెయిలౌట్‌ ఇవ్వడానికి…