హజారే అరెస్టుపై రెండు వారాల్లో నివేదిక కావాలి -జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్
భారత దేశ ప్రజల మానవ హక్కులను కాపాడవలసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఓ విషాధకరమైన జోక్ పేల్చింది. శక్తివంతమైన లోక్ పాల్ బిల్లు కోసం శాంతియుతంగా అమరణ నిరాహార దీక్ష చేపట్టనున్న అన్నా హజారేతో పాటు ఆయన మద్దతుదారులను అరెస్టు చేయడానికి వ్యతిరేకంగా మానవహక్కుల కార్యకర్త ఒకరు పిటిషన్ దాఖలు చేయడంతో దానికి స్పందించింది. అన్నా హజారే, అతని మద్దతుదారుల అరెస్టుపై రెండు వారాల్లొగా నివేదిక సమర్పించాలని హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కమిషన్ కోరింది.…