భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడిన జస్టిస్ చిన్నపరెడ్డి గారి స్మృతిలో…

(సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఒంటెత్తుపల్లి చిన్నప రెడ్డి ఏప్రిల్ 13 తేదీన మరణించారు. భారత దేశంలో అటు న్యాయ పరిపాలనతో పాటు ఇటు రాజకీయ పరిపాలనను కూడా ప్రగతిశీల దృక్పధం వైపుకు నడిపించడానికి ప్రయత్నించిన ‘లెజెండరీ-క్వార్టెట్’ లో జస్టిస్ చిన్నప రెడ్డి ఒకరు. జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్, జస్టిస్ పి.ఎన్.భగవతి, జస్టిస్ డి.ఎ.దేశాయ్ లతో పాటు ‘లెజెండరీ క్వార్టెట్’ గా మన్ననలు అందుకున్న నలుగురిలోకి ఆయనే చిన్నవారు. తన 90 వ యేట వృద్ధాప్యం తెచ్చిన…