హక్కానీ గ్రూపు నాయకుడు పట్టివేత, అమెరికా అబద్ధాల సీరియల్‌లో మరొక పేజీ
ఆఫ్ఘన్ టెర్రరిస్టు సంస్ధల్లో హక్కానీ గ్రూపుకు అమెరికా అధికంగా భయపడుతున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్ధాన్‌ను సోవియట్ రష్యా ఆక్రమించుకున్న కాలంలో ఈ గ్రూపును అమెరికా పాకిస్ధాన్ దేశాలు అత్యంత ఇష్టంగా సాకాయి. జలాలుద్దీన్ హక్కానీ నాయకత్వంలొని హక్కానీ గ్రూపుతో పాటు ఆల్-ఖైదాను కూడా అమెరికా పెంచి పోషించింది. రోజులు మారాయి. సోవియట్ రష్యా మొదట ఆర్ధికంగా అనంతరం రాజకీయంగా కూడా కుప్పకూలడంతో అది తన ప్రభావిత ప్రాంతాలనుండి సైన్యాలను ఉపసంహరించుకుంది. రష్యా సైన్యాలు వెళ్ళాక ఆఫ్ఘనిస్ధాన్‌పై నియంత్రణ…