పాకిస్ధాన్‌పై దాడి చేశారా, జాగ్రత్త! -ఇండియాకు ‘జమాత్ ఉద్-దవా’ హెచ్చరిక
ఇండియా, పాకిస్ధాన్ దేశాల విదేశీ కార్యదర్శులు ఈ వారంలోనే పాకిస్ధాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో చర్చలు జరపనున్నారు. దీనికి సంబందించిన ఏర్పాట్లలో ఇరు దేశాలు మునిగి ఉండగా, తలవని తలంపుగా ఊడిపడిందో ప్రకటన. అది “జమాత్ ఉద్-దవా” (జెయుడి) అనే సంస్ధ, తన సంస్ధాగత సమావేశాలను జరుపుకుంటున్న సందర్భంగా ఇండియాకు చేసిన హెచ్చరిక. కరాచిలో కాన్ఫరెన్సు జరుపుకున్న ఈ సంస్ధ ముగింపులో ఓ డిక్లరేషన్‌ను విడుదల చేసింది. కాన్ఫరెన్సులో పాల్గొన్న నాయకులంతా ఒకే కల కన్నారేమో తెలియదు గానీ…