జపాన్ ను అతలాకుతలం చేసిన భూకంపం, సునామీలు
శుక్రవారం ఈశాన్య జపాన్ సముద్ర అంతర్భాగాన సంభవించిన భూకంపం, దానివలన ఏర్పడిన సునామీలు జపాన్ ఈశాన్య ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. అతి వేగంగా దూసుకొచ్చిన సునామీ ప్రజలను కోలుకోకుండా దెబ్బతీశాయి. సునామీ ధాటికి పెద్ద పెద్ద నౌకలు సైతం తీరాన్ని దాటి ఒడ్డున ఉన్న పట్టణాల్లోని భవనాలను ఢీకొట్టాక గాని ఆగలేదు. పడవలు, కార్లు, బస్సులు లాంటి వాహనాలు ఒకదానిపై ఒకటి చేరి ఇతర శిధిలాలతో కలిసి చెత్తకుప్పలను తలపిస్తున్నాయి. విస్తారమైన ప్రాంతాలు సునామీ ద్వారా కొట్టుకువచ్చిన…