ఫుకుషిమా అణు ప్రమాదాన్ని జపాన్ తక్కువ అంచనా వేసింది -ఐక్యరాజ్య సమితి

మార్చి 11 న సంభవించిన భూకంపం, ఆ తర్వాత పెద్ద ఎత్తున విరుచుకుపడిన సునామీ వలన ఫుకుషిమా దైచి అణు విద్యుత్ కేంద్రానికి జరిగిన ప్రమాదాన్ని జపాన్ ప్రభుత్వం తక్కువ అంచనా వేసిందని ఐక్యరాజ్య సమితి అణు ఇంధన సంస్ధ ఐ.ఎ.ఐ.ఎ తన ప్రాధమిక నివేదికలో పేర్కొన్నది. సముద్రం ఒడ్డున నిర్మించిన ఫుకుషిమా కేంద్రానికి సునామీ వలన ఏర్పడగల ప్రమాదాన్ని అంచనా వేయడంలోనూ, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ జపాల్ విఫలమైందని ఆ సంస్ధ తెలిపింది. నివేదికను…

జపాన్ పునర్నిర్మాణం ఖరీదు రు. 14 లక్షల కోట్లు

శక్తివంతమైన భూకంపం, వినాశకర సునామీల ధాటికి దెబ్బతిన్న ఈశాన్య జపాన్ ని పునర్నించడానికి 300 బిలియన్ డాలర్లు అవసరమని జపాన్ ప్రభుత్వం లెక్కగట్టింది. భూకంపం, సునామీల్లొ ఫుకుషిమా దైచి వద్ద అణు విద్యుత్ కర్మాగారం దెబ్బతిని అందులోని నాలుగు రియాక్టర్ల నుండి రేడియేషన్ వెలువడుతున్న విషయం విదితమే. ప్రమాద స్ధాయి అత్యధిక స్ధాయి 7 గా నిర్ణయించిన ఫుకుషిమా అణు ప్రమాదం నుండి ఆ ప్రాంతాన్ని బైట పడేయడానికి ఎంత కాలం పడుతుందో చెప్పడానికి అణు ప్ల్లాంటు…