జపాన్ క్రెడిట్ రేటింగ్ తగ్గించిన మూడీస్, రాజకీయ అనిశ్చితే కారణం
క్రెడిట్ రేటింగ్ సంస్ధలు ఆర్ధిక పరిణామాలను అధారం చేసుకుని మాత్రమే రేటింగ్ ఇవ్వవలసి ఉండగా, రాజకీయ పరిస్ధితుల ఆధారంగా కూడా క్రెడిట్ రేటింగ్ ఇవ్వడం ప్రారంభించినట్లుంది. ఎడతెగని రాజకీయ సంక్షోభం రీత్యా జపాన్ క్రెడిట్ రేటింగ్ ను ఒక మెట్టు తగ్గించింది. జపాన్ లో గత ఐదు సంవత్సరాలలో ఐదుగురు ప్రధానులు పని చేశారు. ఇప్పటి ప్రధాని కూడా ఆగస్టు నెలాఖరుకు పదవు నుండి తప్పుకోబోతున్నాడు. భూకంపం, సునామీలకు సమర్ధవంతంగా, వేగంగా స్పందించడంలో విఫలమైనాడని అందరూ భావిస్తుండడంతో…