రూపాయి విలువ పడిపోవడానికి యూరోపే కారణం -ఆర్ధిక మంత్రి
గత కొద్ది నెలలుగా రూపాయి విలువ 15 శాతం పైగా పడిపోవడానికి కారణం యూరో జోన్ లోని వ్యవస్ధాగత సమస్యలేనని ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తేల్చేశాడు. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పతనం అవుతుండడంతో దేశ దిగుమతుల బిల్లు తడిసి మోపెడయింది. యూరోజోన్ ఋణ సంక్షోభంతో పాటు కమోడీటీల ధరలు, ముఖ్యంగా ఆయిల్ ధరలు అస్ధిరంగా మారడంతో ఇండియాతో పాటు ఇతర ఆసియా దేశాల్లో ‘చెల్లింపుల సమతూకం’ (Balance of Payment) ఒత్తిడికి గురవుతోందని ప్రణబ్…

