జన్‌లోక్ పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రధాని అంగీకారం, దీక్ష మానాలని వినతి
అన్నా బృందం డిమాండ్ చేస్తున్నట్లుగా “జన్ లోక్ పాల్ బిల్లు” ని పార్లమెంటు ముందు ప్రవేశపెట్టడానికి అంగీకరిస్తున్నట్లు ప్రధాని మన్మోహన్ అన్నాకు రాసిన ఉత్తరంలో ప్రకటించాడు. ఎనిమిది రోజుల నిరాహార దీక్షను ఇంతటితో ఆపివేయాలని ప్రధాని తన లేఖలో కోరాడు. నెల రోజుల పాటు దేశంలోని ఇతర ప్రధాన సమస్యలనుండి పత్రిల కేంద్రీకరణను తనవైపుకు తిప్పుకున్న అన్నా హజారే అవినీతి వ్యతిరేక నిరవధిక నిరాహార దీక్ష మరి కొన్ని గంటల్లో ముగిసే అవకాశం కనిపిస్తోంది. అన్నా హజారే…