జన్ లోక్ పాల్ ఓటమి, రాజీనామా దిశగా అరవింద్
దేశ రాజకీయ చిత్రపటంపై తమను తాము ఉప్పు-నిప్పుగా చెప్పుకునే కాంగ్రెస్, బి.జె.పి లు ఒక తాటి మీదికి రావడంతో ఢిల్లీ అసెంబ్లీలో జన్ లోక్ పాల్ బిల్లు ప్రవేశ దశలోనే ఓటమిని ఎదుర్కొంది. దానితో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజీనామా చేసే దిశలో ప్రయాణిస్తోంది. ముఖేష్ అంబానీపై రాష్ట్ర ఎ.సి.బి చేత అవినీతి కేసు నమోదు చేయించినందుకే కాంగ్రెస్, బి.జె.పిలు ఒక్కటయ్యాయని అరవింద్ ఆరోపించారు. జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదింపజేసుకోవడానికి ఎంత దూరం అయినా…

