జగన్ అవినీతికి మద్దతుగా రాజీనామాలు
దేశమంతా అన్నా హజారే అందిస్తున్న స్ఫూర్తితో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్ధితి అందుకు భిన్నంగా ఉంది. అవినీతికి మద్దతుగా 29 మంది ఎం.ఎల్.ఎ లు ఏకంగా రాజీనామాకే సిద్ధపడ్డారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు విషయంలో హైకోర్టు ఆదేశాల మేరకు సి.బి.ఐ జగన్ కి చెందిన అనేక స్ధావరాలపై గత రెండు రోజులుగా దాడులు చేస్తుండడంతో, జగన్ వేసిన ఎత్తుగడ ఇది. రాజీనామాల ఎత్తుగడతో జగన సాధించేదీ ఏమిటో అర్ధం కావడం లేదు. బహుశా ఉప…