జగన్ రౌడీల నుండి కాపాడండి -డాక్టర్లు

జగన్ వర్గానికి చెందిన రౌడీల బాధ పడలేకున్నామని పులివెందుల డాక్టర్లు ఫిర్యాదు చేస్తున్నారు. పులివెందుల ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ వృత్తిని చేయడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై రౌడీయజానికి పాల్పడిన జగన్ వర్గ రౌడీలపై చర్యలు తీసుకోవాలనీ లేదంటే తమని అక్కడి ఆసుపత్రినుండి బదిలీ చేయాలనీ వారు పత్రికా విలేఖరుల సమావేశం పెట్టి మరీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. పులివెందుల ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్లు కడప ప్రెస్ క్లబ్ లో…