లడ్డు గొడవ జగన్ అరెస్టు కోసమా?

తిరుపతి లడ్డు క్వాలిటీ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపిన రగడ చిలికి చిలికి గాలివానగా మారుతున్నది. ‘గాలివానగా మారిపోయింది’ అని కూడా అనవచ్చునేమో? ఒక సాధారణ తినుబండారానికి దైవత్వం ఆపాదించి భగవంతుడు స్వయంగా ఆశీర్వదించి ప్రసాదించిన ప్రసాదంగా మార్చివేశాక, ఆ తినుబండారం కేంద్రంగా ఇక ఎన్ని రాజకీయాలు చేయవచ్చో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కాకుండా ఆచరణలో చేసి చూపిస్తున్నారు. సెప్టెంబర్ 18 తేదీన అధికారానికి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా…

విద్యుత్ రంగాన్ని జగన్ నాశనం చేశాడు -చంద్రబాబు

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వ నాశనం చేశాడని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించాడు. రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ రంగం పైన శ్వేత పత్రం విడుదల చేస్తూ ముఖ్య మంత్రి గత ముఖ్య మంత్రి జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వలన రాష్ట్ర విద్యుత్ రంగం అనేక నష్టాలు ఎదుర్కొన్నదని, ఇప్పుడు అది అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నదని వివరించాడు.…

జైలులో 125 మంది నాయకులకు ఆతిధ్యం ఇచ్చిన జగన్!

సామాన్య మానవుడికి సాధ్యం కాని ఫీట్ ఇది. బహుశా గిన్నీస్ రికార్డ్ బుక్ ఎక్కడానికి కూడా అర్హత ఉందేమో కూడా. ఎంత వి.వి.ఐ.పి ఐతే మాత్రం, ప్రమాదకరమైన నేరానికి పాల్పడ్డాడని సుప్రీం కోర్టు పదే పదే వ్యాఖ్యానిస్తున్న ఒక నేరస్ధుడికి, సంవత్సర కాలంలో 125 మంది రాజకీయ నాయకులకి మూలాఖాత్ ఇచ్చే అవకాశం ఎవరికి దక్కుతుంది? ఈ సంఖ్య కేవలం రాజకీయ నాయకులదే. సినిమా నటులు, బంధువులు, పారిశ్రామికవేత్తలు తదితర పెద్దలను కూడా కలిపితే రోజుకి కనీసం…