గుజరాత్ అల్లర్లు ఆయన్ని మొదలంటా కదిలించాయట!
దాదాపు పన్నెండేళ్ళ నుండి గుజరాత్ అల్లర్లపై స్పందించడానికి నిరాకరించిన నరేంద్ర మోడి ఇప్పుడు నోరు విప్పారు. తన హయాంలో గుజరాత్ మారణకాండ చోటు చేసుకున్నందుకు కనీసం విచారం ప్రకటించడానికి కూడా మొండిగా తిరస్కరించిన మోడి, జకియా జాఫ్రీ విన్నపాన్ని మెట్రోపాలిటన్ కోర్టు తిరస్కరించిన అనంతరమే స్పందించారు. అల్లర్లపై విచారణ చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నియమించబడిన స్పెషల్ ఇనివేస్టిగేషన్ టీం (సిట్) నరేంద్ర మోడికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని జకియా జాఫ్రీ సవాలు చేశారు. ఆమె…
