గుట్టు రట్టు: భాగ్యలక్ష్మి ఆలయం ఐదు దశాబ్దాల నాటిది మాత్రమే -ఫోటోలు
ఛార్మినార్ కట్టడానికి ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయ కట్టడం గుట్టుని ‘ది హిందూ’ పత్రిక రట్టు చేసింది. హిందూ సంస్ధలు, గ్రూపులు చెబుతున్నట్లుగా భాగ్యలక్ష్మి ఆలయం ఛార్మినార్ కట్టడమంత పాతదేమీ కాదనీ, అది కేవలం 50 సంవత్సరాల క్రితం నాటిదేననీ తెలియజేసింది. బాగ్యలక్ష్మి ఆలయం కట్టడానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా లేని ఫోటోను పత్రిక బుధవారం ప్రచురించింది. ఫోటో పైన తేదీ ఏమీ లేనప్పటికీ ఫోటోలో ఉన్న కార్లను బట్టి అది ఆరు శతాబ్దాల క్రితం తీసిన…
