అయోధ్య రాజకీయం పట్ల వి.హెచ్.పిపై సాధువుల విమర్శలు

రామ మందిరం సమస్యను రాజకీయం చేయడం పట్ల విశ్వ హిందూ పరిషత్ పై అయోధ్య సాధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయ పద్ధతుల్లో ఇప్పటికే తామందరమూ కలిసి పరిక్రమను ఇప్పటికే పూర్తిచేయగా పరిక్రమ పేరుతో మళ్ళీ కొత్త కార్యక్రమం చేపట్టం రాజకీయ లబ్ది పొందేందుకేనని వారు తీవ్రంగా విమర్శించారు. పరిక్రమ యాత్ర అంటూ కరపత్రాలు పంచి ఇప్పుడేమో పరిక్రమ కాదు పధ యాత్ర అంటూ మాట మార్చడంపైన వారు విరుచుకుపడ్డారు. భారత దేశ హిందువులందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు…