సైబర్ దాడుల దోషులు అమెరికా, ఇండియాలే – చైనా
హ్యాకింగ్ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. హ్యాకింగ్ లాంటి సైబర్ దాడులకు అసలు కారకులు అమెరికా, ఇండియాలేనని చైనా ఆరోపించింది. గత ఐదు సంవత్సరాలనుండి ప్రపంచంలోని అనేక ప్రభుత్వాల వెబ్‌సైట్లు, ప్రముఖుల ఈ మెయిళ్ళు పెద్ద ఎత్తున హ్యాకింగ్ కి గురయ్యాయని మెకేఫీ సైబర్ సెక్యూరిటి సంస్ధ వారం క్రితం వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి, తైవాన్, ఇండియా, దక్షిణ కొరియా, వియత్నాం, కెనడా, ఏసియాన్, ఐ.ఒ.సి, తదితర 72 సంస్ధలు హ్యాకింగ్ కి గురయ్యాయని చెబుతూ, దీని వెనుక…