ఉక్రెయిన్: ఆయుధ రహస్యాలు చైనాకు చేరుతున్నాయన్న బెంగలో అమెరికా!

ఇప్పుడు అమెరికాకి కొత్త భయం పట్టుకుంది. ఉక్రెయిన్ సైన్యానికి సరఫరా చేస్తున్న అమెరికా ఆయుధాలన్నీ రష్యా యుద్ధ ఎత్తుగడల ముందు ఎందుకూ పనికి రాకుండా విఫలం అవుతుండడంతో తమ ఆయుధాల రహస్యాలు రష్యాకు తెలిసిపోతున్నాయని ఆందోళన చెందుతోంది. అంతకంటే ముఖ్యంగా తమ ఆయుధాల రహస్యాలను రష్యా, చైనాకు కూడా సరఫరా చేస్తున్నదని అనుమానిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల ఆయుధాల సమాచారం చైనాకు సరఫరా అవుతోందన్న అనుమానం అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తున్నది. అమెరికా మరియు…

వేగంగా పెరుగుతున్న నగరం షాంఘై నాడు, నేడు -యానిమేషన్

ఇండియాకు ముంబై ఎలాగో చైనాకు షాంఘై నగరం అలాగ! ఇండియాకి ముంబై వాణిజ్య నగరంగా పేరొందితే, షాంఘై చైనాకి వాణిజ్య నగరంగా ప్రసిద్ధికెక్కింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరం ఇదేనట! అలాగని ది అట్లాంటిక్ పత్రిక చెబుతోంది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరం కూడా ఇదేనని సదరు పత్రిక తెలిపింది. రాయిటర్స్ ఫోటోగ్రాఫర్ కార్లోస్ బర్రియా ఇటీవల షాంఘై నగరాన్ని సందర్శించి కొన్ని ఫోటోలు తీశాడు. 1987 నాటి ఫోటో ఒకటి…