బీజింగ్ విమానాశ్రయంలో పేలుడు, వీల్ చైర్ వ్యక్తి అరెస్టు

బీజింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వీల్ చైర్ లో విమానాశ్రయంలోకి వచ్చిన వ్యక్తి ఒకరు బాంబు పేలుడుకు పాల్పడ్డాడు. పేలుడుకు పాల్పడిన వ్యక్తి తప్ప మరెవ్వరూ గాయపడలేదని తెలుస్తున్నది. పోలీసుల చేతుల్లో చిత్రహింసలకు గురయ్యి అంగవైకల్యం పొందిన వ్యక్తి చాలా కాలంగా న్యాయం కోసం పోరాడి విఫలమై ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. చైనాలో ధనిక వర్గాలకు అనుకూలంగా సామాన్యులపై పోలీసు నిర్బంధం తారాస్ధాయికి చేరిందని తాజా ఘటన స్పష్టం చేస్తోంది.…

అమెరికా మానవ హక్కుల రికార్డు పరమ ఘోరం -2

గత పోస్టు తరవాయి భాగం… 3. ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక హక్కులు వాస్తవ నిరుద్యోగం అధికారిక అంచనాల కంటె చాలా అధికంగా 20 శాతం పైనే ఉంది. (ఇది అధికారిక అంచనాకి రెట్టింపుకంటె ఎక్కువ). ఆహారం, ఇంధనం, వైద్య ఖర్చులు, విద్యా ఖర్చులు తదితర ధరలు అధికారిక లెక్కల్లో చాలా తక్కువచేసి చూపడం వలన వాస్తవ ద్రవ్యోల్భణం 10 శాతం పైనే ఉంటుంది. (ఇది కూడా అధికారిక అంచనాకి రెట్టింపుకంటె ఎక్కువ). జీవనానికి పడుతున్న వాస్తవ ఖర్చు…

అమెరికా మానవ హక్కుల రికార్డు పరమ ఘోరం -1

ప్రతి సంవత్సరం అమెరికా ప్రపంచ దేశాల మానవ హక్కుల ఆచరణ తీరుపై ఒక నివేదిక వెలువరిస్తుంది. 2010 సంవత్సరానికి కూడా అలావే మానవ హక్కుల నివేదికని వెలువరించింది. అందులో 190కి పైగా దేశాలపై తన తీర్పు రాసుకుంది. 145 పేజీల ఈ నివేదికలో అమెరికా మానవహక్కుల రికార్డు మాత్రం ఉండదు. ప్రపంచంలోనే మానవ హక్కులను ఉల్లంఘించడంలో సంఖ్య రీత్యా, పద్దతుల రీత్యా కూడా మొదటి స్ధానంలో ఉండే అమెరికా తన కింద నలుపు కాదు కదా, ఒళ్ళంతా…