చైనా నెటిజన్లలో ఆసక్తి రేపుతున్న హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం

గత వారం రోజులుగా భారత దేశంలో పతాక శీర్షికలను ఆక్రమించిన అన్నా హజారే నేతృత్వంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమం చైనా నెటిజన్లలో ఆసక్తిని రేపుతోంది. ఈ సందర్భంగా చైనా దేశీయులు రెండు దేశాల మధ్య అవినీతిలో పోలికలు తేడాల గురించి చర్చించుకుంటున్నారు. గత సంవత్సరానికి చైనాలో 46 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్న నేపధ్యంలో ఇంటర్నెట్ వినియోగంపై చైనా ప్రభుత్వం సెన్సారింగ్ విధిస్తుంది. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి వార్తలు చైనా ప్రజలకు అందుబాటులో లేకుండా…