చైనా బ్యాంకుల్లో పేరుకుపోయిన తిరిగి రాని అప్పులు $0.5 ట్రిలియన్లు -మూడీస్ హెచ్చరిక

చైనా బ్యాంకుల్లో తిరిగి రాని అప్పులు పేరుకుపోయాయనీ, అవి అలానే కొనసాగితే చైనా బ్యాంకుల క్రెడిట్ రేటింగ్ తగ్గించాల్సి ఉంటుందని మూడీస్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ హెచ్చరించింది. 2008లో ఆర్ధిక సంక్షోభం సంభవించినపుడు, దాని బారిన పడకుండా ఉండడానికి చైనా పెద్ద ఎత్తున బెయిల్ ప్యాకేజీని అమలు చేసింది. బెయిలౌట్ ప్యాకేజితో పాటు దేశంలోపల విచ్చలవిడిగా అప్పులు మంజూరు చేసింది. ఉత్పత్తి కార్యక్రమాలకు బదులుగా వినియోగ సరుకులైన కార్లు, టి.విలు, ఫ్రిజ్ లు కొనుగోలు చేయడానికి అప్పులు…