నష్టపరిహారం ఇవ్వకుండా భూములు లాక్కొని వెళ్ళగొట్టడం చైనాలోనూ మామూలే

ఇండియా, చైనా. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మొదటి రెండు స్ధానాల్లో ఉన్న దేశాలు ఇవి. ‘ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ’ లుగా ప్రపంచ ఆర్ధిక పండితులచేత ప్రశంసలు అందుకుంటున్న దేశాలు. కాని ఈ రెండు దేశాలు తమ ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసి, వారి వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా ఫణంగా పెట్టిమరీ ఆర్ధిక వృద్ధిని సాధిస్తున్నాయన్నది ఆ దేశాల ప్రజలకు మాత్రమే తెలిసిన సత్యం. భారత దేశంలో పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించ తలపెట్టిన…