3 సం.ల అత్యధిక స్ధాయిలో చైనా ద్రవ్యోల్బణం, చైనా ఆర్ధిక వృద్ధిపై భయాలు

జూన్ నెలలో చైనా ద్రవ్యోల్బణం గత మూడు సంవత్సరాల అత్యధిక స్ధాయికి చేరింది. ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వీలుగా చైనా ఆర్ధిక వ్యవస్ధలో ద్రవ్య చలామణిని తగ్గించడానికి సెంట్రల్ బ్యాంకు వడ్దీ రేట్లను మరింత పెంచే అవకాశాలు పెరగడంతో, వడ్డీ రేట్ల పెంపుదల వలన చైనా ఆర్ధిక వృద్ధి రేటు పడిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ పెట్టుబడుదారులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటును ముందుకు తీసుకెళ్ళడంలో చైనా ఆర్ధిక వ్యవస్ధ…