తూ.చై సముద్రం: చైనా అమెరికా మధ్య ఉద్రిక్తతలు
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో చైనా తనదైన నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటోందా? వాణిజ్య, దౌత్య చర్యల వరకే ఇన్నాళ్లూ పరిమితమైన చైనా ఇక తన మిలట్రీ శక్తిని కూడా ప్రదర్శించడానికి సిద్ధపడుతోందా? గత శనివారం చైనా చేసిన ప్రకటన ఈ ప్రశ్నలకు జన్మనిచ్చాయి. తూర్పు చైనా సముద్రంలో వివాదాస్పద దియోయు/సెంకాకు ద్వీపకల్పం పైన ‘వాయు రక్షణ మండలం’ (Air Defence Zone) ఏర్పాటు చేస్తున్నట్లు చైనా ప్రకటించడం పెను సంచలనం కలిగించింది. చైనా ప్రకటనను జపాన్, అమెరికాలు తిరస్కరించాయి.…
