చైనీయ సంప్రదాయాలకు పెద్ద పీట వేసే చైనా కొత్త సంవత్సరం -ఫోటోలు
అతి పురాతన నాగరికతలు విలసిల్లిన దేశాల్లో చైనా కూడా ఒకటి. ప్రాచీన నాగరికతలు పరిఢవిల్లిన ప్రతి చోటు లోనూ కాలాన్ని కొలిసే సాధనాలు అనివార్యంగా అభివృద్ధి అయ్యాయి. ఇండియాలోని వివిధ సంప్రదాయాలకు మల్లె చైనాలోనూ కొత్త సంవత్సరం ఆరంభం-ముగింపులు సూర్య, చంద్రుల కదలికలపై ఆధారపడి నిర్ధారించబడ్డాయి. ఇప్పుడంటే క్రీస్తు పూర్వమూ, శకమూ అంటూ యూదు/పాశ్చాత్య కాలాన్ని పాటిస్తూ అర్ధరాత్రి తాగి గెంతుతున్నాం గానీ భారత దేశంలోనూ వివిధ ప్రాంతాలు, వివిధ భాషీయులు తమ తమ కొత్త సంవత్సరాలను…