చైనా వృద్ధి కిందికి, ఉద్దీపన ఊహలకు ఊపు

చైనా ఆర్ధిక వృద్ధి అనుకున్నంత స్ధాయిలో నమోదు కావడం లేదన్న అంచనాలు పెరుగుతుండగా ఆ దేశ ప్రభుత్వం మరోసారి ఆర్ధిక ఉద్దీపన అమలు చేయనుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2014 ఆర్ధిక సంవత్సరానికి గాను (చైనా ఆర్ధిక సంవత్సరం జనవరి 1 తేదీన మొదలై డిసెంబర్ 31తో ముగుస్తుంది) 7.5 శాతం జి.డి.పి వృద్ధి నమోదు చేయాలని చైనా ఆశిస్తోంది. అయితే అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతులు పడిపోతున్న పరిస్ధితుల్లో ఇది సాధించడం అనుమానంగా మారింది. ఫలితంగా మరో…

చైనా 2016కల్లా అమెరికాను దాటిపోతుంది -ఒఇసిడి

2016 నాటికి చైనా ఆర్ధిక వ్యవస్థ ‘పర్చేసింగ్ పవర్ ప్యారిటీ’ (పి.పి.పి) పరంగా అమెరికాను మించిపోతుందని ఒఇసిడి (Organization for Economic Cooperation and Development) జోస్యం చెప్పింది. వరుసగా నాలుగో దశాబ్దంలో వేగవంతమైన ఆర్ధిక వృద్ధి (జి.డి.పి వృద్ధి రేటు) నమోదు చేయడానికి చైనా ఉరుకులు పరుగులు పెడుతోందని ఒఇసిడి విడుదల చేసిన తాజా నివేదిక తెలియజేసింది. గత సంవత్సరం జపాన్ ఆర్ధిక వ్యవస్థ పరిమాణాన్ని మించి పోయి అమెరికా తర్వాత అతి పెద్ద ఆర్ధిక…

ఆర్ధిక మాంద్యాన్ని తట్టుకున్న చైనా, ఐ.ఎం.ఎఫ్ ప్రశంస

ఆర్ధిక మాంద్యాన్ని అధిగమించి ‘సాఫ్ట్ ల్యాండింగ్’ ని సాధించగలిగిందని ఐ.ఎం.ఎఫ్ చైనాపై ప్రశంసలు కురిపించింది. ప్రపంచం అంతా నెమ్మదించిన ఆర్ధిక వృద్ధి (slow growth) పరిస్ధితులను ఎదుర్కొంటున్నప్పటికీ వాటన్నింటినీ చైనా తట్టుకోగలిగిందని వ్యాఖ్యానించింది. ఇతర దేశాలతో వాణిజ్య మిగులును తగ్గించుకోవడమే కాక ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేయగలిగిందని ప్రశంసించింది. ఎన్ని పొగడ్తలు కురిపించినా ఆర్ధిక వ్యవస్ధను ఇంకా సంస్కరించాలని సన్నాయి నొక్కులు కూడా నోక్కింది. దేశాన్ని పూర్తిగా పశ్చిమ బహుళజాతి కంపెనీలకు అప్పగించాలన్న సందేశాన్ని పరోక్షంగా అందజేసింది. “ప్రపంచ…

చైనాలో మరింత క్షీణించిన వ్యాపార వృద్ధి, రికార్డు స్ధాయిలో వాణిజ్య మిగులు

చైనాలో జూన్ నెలలో వ్యాపార కార్యకలాపాలు మరింత నెమ్మదించాయని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. మే నెలలో కంటే జున్ నెలలో కూడా దిగుమతులు పడిపోయాయి. దానితో చైనాకు వాణిజ్య మిగులులో మరింత పెరుగుదల రికార్డయ్యింది. ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ కలిగిన చైనా, ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వాణిజ్య మిగులు 22.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. మే నెలలో దిగుమతుల వృద్ధి రేటు 28.4 శాతం ఉండగా, జూన్ నెలలో అది…