చైనా వృద్ధి కిందికి, ఉద్దీపన ఊహలకు ఊపు

చైనా ఆర్ధిక వృద్ధి అనుకున్నంత స్ధాయిలో నమోదు కావడం లేదన్న అంచనాలు పెరుగుతుండగా ఆ దేశ ప్రభుత్వం మరోసారి ఆర్ధిక ఉద్దీపన అమలు చేయనుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2014 ఆర్ధిక సంవత్సరానికి గాను (చైనా ఆర్ధిక సంవత్సరం జనవరి 1 తేదీన మొదలై డిసెంబర్ 31తో ముగుస్తుంది) 7.5 శాతం జి.డి.పి వృద్ధి నమోదు చేయాలని చైనా ఆశిస్తోంది. అయితే అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతులు పడిపోతున్న పరిస్ధితుల్లో ఇది సాధించడం అనుమానంగా మారింది. ఫలితంగా మరో…

అధిక ద్రవ్యోల్బణాన్ని అధిగమించి రికార్డు ఆర్ధిక వృద్ధి నమోదు చేసిన చైనా

అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ ధరలు, అధిక ధరలు అన్నింటినీ అధిగమిస్తూ చైనా అర్ధిక వ్యవస్ధ ఈ సంవత్సరం రెండో క్వార్టర్ లో 9.5 ఆర్ధిక వృద్ధిని నమోదు చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆర్ధికవేత్తలు, మార్కెట్ విశ్లేషకుల అంచనా 9.4 శాతం అంచనాని దాటి చైనా అర్ధిక వ్యవస్ధ వృద్ధి చెందటం గమనార్హం. చైనా ఆర్ధిక వృద్ధి నెమ్మదిస్తూన్నదన్న భయాలను ఈ దెబ్బతో చైనా పటాపంచలు చేసినట్లయింది. తాజా ఆర్ధిక వృద్ధి రేటుతో ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి…