ప్రజా ప్రతిఘటనకు ప్రతిరూపంగా హైవే నడిబొడ్డున నిలిచిన చైనా ఇల్లు

ప్రజల కనీస అవసరాలపై కూడా ఆధిపత్యం చెలాయించే ధనికవర్గ ప్రభుత్వాలకు ప్రజాసామాన్యం ఇచ్చే ప్రతిఘటనకు సంకేతాత్మక రూపం ఈ ఇల్లు. ఝెజియాంగ్ రాష్ట్రంలోని వెన్ లింగ్ పట్టణంలో నూతనంగా నిర్మించిన రోడ్డు కోసం ప్రజల ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. జీవితం అంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇటీవలే నిర్మించుకున్న తన ఇంటిని కూల్చడానికి అంగీకరిస్తూ సంతకం పెట్టడానికి ఓ వృద్ధ జంట నిరాకరించడంతో ప్రధాన రోడ్డు నడి మధ్యలో ఈ ఇల్లు ఇలా నిలబడిపోయింది. యాజమానుల అంగీకారం…

చైనాలో కారు బాంబు పేలుళ్ళు, ఇద్దరు మృతి

చైనాలోని జీయాంక్సి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ముందు కారు బాంబులు పేలాయి. కనీసం మూడు పేలుళ్ళు జరిగాయని, ఈ పేలుళ్ళలొ ఇద్దరు పౌరులు చనిపోయారనీ బిబిసి తెలిపింది. ఫుఝౌ పట్టణంలో జరిగిన ఈ పేలుళ్ళలో మరో ఆరుగురు గాయపడ్డారు. రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయం, నగర ఆహరము మందుల ఏజెన్సీ కార్యాలయం, జిల్లా పాలనా కార్యాలయ భవనాల ముందు ఉన్న కారు బాంబులుంచారని తెలుస్తోంది. ఇవన్నీ ఒకేసారి పేలినట్లు జిన్‌హువా వార్తా సంస్ధ తెలిపింది. పేలుళ్ళకు కారణాలను…

జీ-మెయిల్ సర్వీసును చైనా ప్రభుత్వం అడ్డగిస్తోంది -గూగుల్

తమ ఈ-మెయిల్ సర్వీసుకు చైనా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని గూగుల్ సంస్ధ ఆరోపించింది. ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లొ లాగా చైనా ప్రదర్శనలు నిర్వహించాలన్న సందేశాలు వ్యాప్తి చెందుతున్నందు వలన చైనా ప్రభుత్వం జీ-మెయిల్ సర్వీసుకు ఆటంకాలు సృష్టిస్తోందని జీ-మెయిల్ వినియోగదారులు చెప్పినట్లు బిబిసి తెలిపింది. గత కొద్ది వారాలుగా చైనా అధికారులు గూగుల్ మెయిల్ సర్వీసు వినియోగించకుండా ఆటంకాలు సృష్టిస్తూ జీ-మెయిల్ సాఫ్ట్ వేర్ లోనే ఏదో సమస్య ఉందని భావించేలా చేస్తోందని గూగుల్ తన ఆరోపణలను…

చైనాలో ప్రదర్శనకు పిలుపు, ఉక్కుపాదం మోపిన చైనా పోలీసులు

  అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక హక్కుల కోసం చెలరేగుతున్న ప్రజా ఉద్యమాలు చైనా ప్రభుత్వానికి సమస్యలను తెచ్చి పెడుతున్నాయి. ఆదివారం ట్యునీషియా తరహాలో చైనాలోని బీజింగ్, షాంగై నగరాల్లో జాస్మిన్ గేదరింగ్ జరపాలని అమెరికానుండి నిర్వహించబడుతున్న ఒక వెబ్ సైట్ చేసిన ప్రచారానికి ఎవరూ గుమిగూడకుండా చైనా పోలీసులు కట్టుదిట్టం చేశారు. విదేశీ విలేఖరులను కూడా వదల కుండా కెమెరాలను లాక్కొని ఫోటోలను తొలగించారు. ప్రదర్శన కోసం పిలుపునిచ్చిన ప్రాంతంలో ఎవరూ ఎక్కువ సేపు ఆగకుండా చీపుర్లతో…

“మల్లెల విప్లవం” నేపధ్యంలో దేశ వ్యాపిత “డేటాబేస్” నిర్వహణకై చైనా అధికారి సూచన

  అరబ్ ప్రజా ఉద్యమాల స్ఫూర్తితో చైనాలో క్రితం వారం ఇంటర్నెట్ ద్వారా అటువంటి ప్రదర్శనను నిర్వహించాలంటూ ప్రచారం జరిగిన నేపధ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఝౌ యాంగ్ కాంగ్ హెచ్చరించాదు. పొలిట్ బ్యూరోలో ఝౌ, చట్ట పాలనకు (లా అండ్ ఆర్డర్) భాద్యుడు. సామాజిక వ్యవస్ధ నిర్వహణ పట్ల జాగ్రత్త వహించాలనీ సమాజంలో సంఘర్షణలను, సమస్యలను ముందే గుర్తించాలనీ ఆయన సీనియర్ అధికారులను కోరినట్లుగా అధికార…