అమెరికా, చైనా లు లేకుండా ప్రపంచ సమస్యల పరిష్కారం కుదరదు -హిల్లరీ
చైనాకు ప్రపంచ రాజకీయాల్లో ఉన్న స్ధాయిని అమెరికా మరొకసారి బహిరంగంగా అంగీకరించింది. ప్రపంచ వ్యవహారాల్లో ప్రతి టేబుల్ వద్దా చైనాకు సీటు ఉందనీ, ప్రపంచ స్ధాయిలో ప్రాముఖ్యం కలిగిన ప్రతి సంస్ధలోనూ చైనాకు పాత్ర ఉందనీ, అమెరికా, చైనాలు లేకుండా ప్రపంచంలో ఏ సమస్య అయినా పరిష్కారం కావడం అసంభవమనీ అమెరికా విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) హిల్లరీ క్లింటన్ ప్రకటించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు నిక్సన్ చైనా సందర్శించి 40 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా…
