రష్యా టెర్రర్ దాడులకు కారణం సౌదీ?!
మూడు వారాల క్రితం రష్యా పట్టణం వోల్గో గ్రాడ్ లో జరిగిన ఉగ్రవాద పేలుళ్లకు కారణం సౌదీ అరేబియా అయి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ పేలుళ్లకు బాధ్యులుగా ఇంతవరకూ ప్రకటించుకోనప్పటికీ డోకు ఉమరోవ్ నేతృత్వంలోని చెచెన్ తీవ్రవాద సంస్ధే పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చని ఇప్పుడు పలు పత్రికలు భావిస్తున్నాయి. చెచెన్ ఉగ్రవాద నేత డోకు ఉమరోవ్ ‘కాకసస్ ఎమిరేట్స్’ అనే సంస్ధకు నాయకత్వం వహిస్తున్నాడు. సౌదీ అరేబియా పాలక వంశం పోషించే వహాబిస్టు మత భావాలను…

