రాజీనామాకు సిద్ధపడిన హోం మంత్రి పి.చిదంబరం

2జి స్పెక్ట్రం కుంభకోణంపై జరుగుతునన్ విచారణ కాంగ్రెస్ పునాదులను పెకలిస్తోంది. కేంద్ర కేబినెట్‌లో అత్యంత ఉన్నత స్ధానాన్ని పొంది ఉన్న హోం మంత్రి పి.చిదంబరం తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు. తమ నాయకురాలు సోనియా గాంధిని కలిసిన పి.చిదంబరం తన పదవికి రాజీనామా చేస్తానని కోరినట్లుగా తెలుస్తొంది. టి.వి ఛానెళ్ళు ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి. సోనియాతో జరిగిన 20 నిమిషాల సమావేశంలో చిదంబరం రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లుగా అవి ప్రసారం చేస్తున్నాయి. అయితే…