ఐ.ఎం.ఎఫ్ అంటే అలిగితిమి, ఆర్.బి.ఐదీ అదే మాటాయె!
భారత ఆర్ధిక వృద్ధి రేటు అంచనాను ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు లు తగ్గించినందుకు భారత ప్రభుత్వం తీవ్ర స్ధాయిలో ఉడుక్కుంది. ఎంతగా ఉడుక్కుందంటే, అసలు ఐ.ఎం.ఎఫ్ ఆర్ధిక అంచనా పద్ధతులను మార్చిపారేయాలని మన ఆర్ధిక మంత్రి చిదంబరం నేరుగా ఐ.ఎం.ఎఫ్ (వాషింగ్టన్) సమావేశాల్లోనే డిమాండ్ చేసేంతగా. తీరా చూడబోతే మన ఆర్.బి.ఐ కూడా భారత వృద్ధి రేటును దాదాపు ప్రపంచ బ్యాంకు అంచనాకు దరిదాపుల్లోనే ఉంచింది. 2013-14 లో ఇండియా వృద్ధి రేటు 4.7 శాతం ఉంటుందని…




