విషవాయువు విడుదల, స్టెరిలైట్ కంపెనీ మూసివేతకు ఆర్డర్

మార్చి 23 తేదీన విషపూరితమైన సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువును విడుదల చేసి పరిసర గ్రామాల ప్రజలను అనారోగ్యానికి గురిచేసిన ‘స్టెరిలైట్ కాపర్’ కంపెనీని మూసివేయాల్సిందిగా తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. చుట్టుపక్కల గ్రామాల పొలాలను పనికి రాకుండా చేసిన ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామీణులు అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. ఫ్యాక్టరీ మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సమీప గ్రామాల ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. టపాకాయాలు కాల్చి తమ సంతోషాన్ని తెలియజేశారు.…