చంద్రబాబునాయుడు ఆస్తులపై సి.బి.ఐ విచారణకు హైకోర్టు ఆదేశం

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విసిరిన పాచిక తాత్కాలికంగానైనా పని చేసినట్లు కనిపిస్తోంది. దాదాపు రెండు వేల పేజీల సాక్ష్యాలతో మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అక్రమ ఆస్తుల సంపాదించాడంటూ జగన్ తల్లి వై.విజయమ్మ ద్వారా వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు డివిజన్ బెంచి పిటిషనర్ల కోరిక మేరకు సి.బి.ఐని రంగంలోకి దించింది. వై.విజయమ్మ ఆరోపించినట్లుగా మాజీ ముఖ్యమంత్రి తన అధికారాన్ని ఉపయోగించుకుని, రామోజీరావును ముందుంచి అక్రమ ఆస్తులను సంపాదించిందీ లేనిదీ విచారించవలసిందిగా హైకోర్టు బెంచి సి.బి.ఐని ఆదేశించింది.…