గ్లోబల్ రికవరీకి ప్రమాదం పొంచి ఉంది, వెంటనే చర్యలు తీసుకొండి -ఐ.ఎం.ఎఫ్

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ ఐ.ఎం.ఎఫ్ ప్రపంచ దేశాలను మరోసారి హెచ్చరించింది. మూడు సంవత్సరాల క్రితం ఏర్పడిన తీవ్ర ఆర్ధిక సంక్షోభం నుండి కుంటుతూ కోలుకుంటున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మరోసారి సంక్షోభంలో జారిపోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. వెంటనే చర్యలు తీసుకుంటే తప్ప దాన్ని అరికట్టలేమని ఐ.ఎం.ఎఫ్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్ట్రీన్ లాగార్డే తెలియజేసింది. “ఈ వేసవిలో జరిగిన పరిణమాలు, మనం ప్రమాదకరమైన కొత్త దశలో ఉన్నమాని సూచిస్తున్నాయి. బలహీనంగా ఉన్న ఆర్ధిక రికవరీ…