గ్రీసు కష్టాలు తీరాలంటే తన సార్వభౌమాధికారాన్ని వదులుకోవాలి -జర్మనీ మంత్రి
యూరోపియన్ యూనియన్, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసు కోసం ప్రకటిస్తూ వచ్చిన బెయిలౌట్ల అసలు ఉద్దేశం ఎట్టకేలకు బహిర్గతమయ్యింది. గ్రీసు, రుణ సంక్షోభంలో కూరుకుపోవడంతో అవి రెండు బెయిలౌట్ల పేరుతో కఠిన రుణాలను మంజూరు చేస్తున్న సంగతి విదితమే. అత్యంత దారుణమైన షరతులతో ఇచ్చిన ఈ రుణాల ఫలితంగా గ్రీసు ఆర్ధిక మాంద్యంలోకి వెళ్ళిపోయింది. గ్రీసు జిడిపి దారుణంగా పడిపోయింది. రుణ షరతుల ఫలితంగా ప్రభుత్వ ఖర్చులలో తీవ్రంగా కోత పెట్టడంతో సంభవించిన ఫలితమిది. వారి షరతులను పూర్తిగా…