ఆర్ధిక సంక్షోభం దెబ్బకు కుప్పకూలనున్న గ్రీసు ప్రభుత్వం

గ్రీసు ప్రభుత్వం అంతిమ క్షణాల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇ.యు దేశాలు, ఐ.ఎం.ఎఫ్ సంస్ధ ఇవ్వ జూపిన 130 బిలియన్ యూరోల బెయిలౌట్, దానితో పాటే వచ్చే కఠినమైన షరతులను గ్రీసు ప్రజల ఆమోదానికి పెట్టడానికై రిఫరెండం నిర్వహిస్తామని గ్రీసు ప్రధాని గత సోమవారం ప్రకటించినప్పటినుండీ అక్కడి పరిణామాలు వేగవంతం అయ్యాయి. ఆశ్చర్యం ఏమిటంటే యూరప్ పెద్ద తలకాయలైన జర్మనీ, ఫ్రాన్సు దేశాల ప్రభుత్వాధిపతులు ఇద్దరూ రిఫరెండం ఆలోచనను సమర్ధించారు. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల బెయిలౌట్ పైనే కాకుండా…