సంక్షోభ పరిష్కారంలో జి20 వైఫల్యం, మరో మాంద్యానికి చేరువలో ప్రపంచం?
యూరో జోన్ రుణ సంక్షోభం రీత్యా సంక్షుభిత దేశాలకు సహాయం చేయడానికి జి20 దేశాలు ఏ చర్యా ప్రకటించలేదు. దానితో యూరప్ సంక్షోభ పరిష్కారానికి ఎమర్జింగ్ దేశాలు గానీ, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు గానీ సహాయం చేయడానికి సిద్ధంగా లేవన్న సంగతి ధృవపడింది. ఫలితంగా మరోసారి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యం (రిసెషన్) లోకి జారుకుంటుందన్న అంచనాలు జోరందుకున్నాయి. గ్రీసులో రాజకీయ సంక్షోభం కొద్దిలో తప్పిపోయింది. వారం రోజుల క్రితం గ్రీసు కోసం ఇ.యు, ఐ.ఎం.ఎఫ్…