యూరోజోన్ విచ్ఛిన్నం ప్రారంభం, గ్రీసును సాగనంపడానికి ప్రయత్నాలు

12 సంవత్సరాల వయసులోనే యూరోజోన్ విచ్ఛిన్నం అనివార్యంగా మారింది. ఎంతో అట్టహాసంతో, మరెన్నో ఆశలతో ప్రారంభమైన యూరోజోన్ మానిటరీ యూనియన్ ఆర్ధిక సంక్షోభాల ధాటికి పన్నెండో సంవత్సరంలోనే విచ్ఛిన్నానికి దగ్గరయ్యింది. ప్రపంచ దేశాలకు ఉమ్మడి కరెన్సీగా, అందరూ కోరుకునే అంతర్జాతీయ మారక కరెన్సీగా డాలర్ చెలాయిస్తున్న ఆధిపత్యానికి గండికొట్టి పోటీగా ఎదగడానికి ఏర్పాటు చేసుకున్న యూరో కరెన్సీ తన లక్ష్యాన్ని సాధించకపోగా అప్పుడే ఒక సభ్య దేశాన్ని సాగనంపడానికి సిద్ధపడుతోంది. యూరో గ్రూపు రాజకీయ నాయకుడుగా ఉన్న…