వాతావరణంలో రికార్డు స్ధాయిలో కర్బనవాయు నిల్వలు

భూమి వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయు నిల్వల స్ధాయి రికార్డు స్ధాయికి చేరిందని ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్ధ (వరల్డ్ మీటియరలాజికల్ ఆర్గనైజేషన్ -డబ్ల్యూ.ఎం.ఒ) తెలిపింది. గతంలో ఎన్నడూ ఇంత సాంద్రతతో గ్రీన్ హౌస్ వాయు నిల్వలు భూ వాతావరణంలో లేవని, 2012, 2013 సంవత్సరాల్లోనే అత్యధిక స్ధాయిలో ఈ నిల్వలు పెరిగాయని సంస్ధ చెప్పడం విశేషం. గత రెండు, మూడేళ్లుగా ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాల (గ్రీన్ హౌస్ వాయువులు) విడుదలను తగ్గించడం ఎలా అన్న…