ప్రయాణీకుల జెట్ విమానంపై పొరపాటున కాల్పులు జరిపిన దక్షిణ కొరియా సైన్యం
దేశాల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం ఎటువంటి ప్రమాదాలకు దారితీస్తుందో తెలియ జెప్పే సంఘటన ఇది. 119 మంది ప్రయాణికులు ఉన్న జెట్ విమానం ఉత్తర కొరియా ప్రయోగించిన యుద్ధ విమానంగా భావించి దక్షిణ కొరియా సైన్యం దానిపైకి కాల్పులు జరిపించి. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఆ రెండూ 1950ల్లో విడిపోయినప్పటినుండీ ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా దక్షిణ కొరియాలో సైనిక స్దావరాన్ని ఏర్పాటు చేసుకుని తద్వారా ఇరు పక్షాల…