కూడంకుళం: ప్రధానికి సహాయపడితే విదేశీ నిధులు ఓ.కేనా? -అణు బోర్డు మాజీ చైర్మన్
కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారం వల్ల ప్రజల భద్రతకు ప్రమాదం లేదనీ, తాము అన్నివిధాలుగా భద్రతా చర్యలు తీసుకున్నామనీ ప్రధాని మన్మోహన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న కబుర్లు నిజం కాదని రుజువవుతోంది. భారత అణు శక్తి నియంత్రణ బోర్డు (Atomic Energy Regulatory Board -AERB) మాజీ అధిపతి గోపాల్ కృష్ణన్ స్వయంగా ఈ విషయాన్ని బట్టబయలు చేశాడు. ఫుకుషిమా అణు ప్రమాదం దరిమిలా, కూడంకుళం అణు…
