పాకిస్ధాన్‌తో అమెరికా రాజీ, భారత్ ప్రయోజనాలకు ఎసరు?
బహిరంగంగా పాకిస్ధాన్ పై నిప్పులు చెరుగుతున్న అమెరికా రహస్యంగా రాజీ చేసుకోవడానికి సిద్ధపడుతున్నదన్న అనుమానాలు బలపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పాకిస్ధాన్ కు హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో అమెరికా సైనికులపైనా, ఆఫ్ఘన్ లోని అమెరికా ఎంబసీపైనా జరిగిన వరుస దాడులకు హక్కానీ గ్రూపుదే బాధ్యత అని అమెరికా అధికారులు భావిస్తున్నారు. పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ మద్దతుతోనే హక్కానీ గ్రూపు దాడులు చేయగలుగుతున్నదని కూడా వారు భావిస్తున్నారు.…