స్వయం ప్రతిపత్తి కోసం సొంత శాటిలైట్ల ఏర్పాటులో ఐరోపా!

వ్యూహాత్మక ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు ఇన్నాళ్లూ అమెరికాపై ఆధారపడుతూ వచ్చిన ఐరోపా దేశాలు (యూరోపియన్ యూనియన్) ఇక తమకంటూ సొంత ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. అందుకు అవసరమైన మౌలిక నిర్మాణాలను (ఇన్ఫ్రాస్ట్రక్చర్) ఉనికిలోకి తెస్తున్నాయి. ఐరోపా వ్యాపితంగా దృఢమైన, గ్యారంటీతో కూడిన ఇంటర్నెట్ కనెక్టివిటీని స్థాపించడం కోసం సొంత ఉపగ్రహాలను భూ కక్ష్యలో ప్రవేశ పెట్టాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఇందుకోసం 6 బిలియన్ యూరోల ($6.8 బిలియన్లు) నిధులు కేటాయించినట్లు యూరోపియన్ కమిషన్ ప్రకటించింది. ఉపగ్రహాల…