ఇంటర్నెట్ స్వేఛ్చపై అమెరికాకు చైనా హెచ్చరిక

చైనా మరోసారి అమెరికాను హెచ్చరించింది. “ఇంటర్నెట్ స్వేఛ్చ పేరుతో తన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేద”ని తీవ్రంగా హెచ్చరించింది. ఇంటర్నెట్ ఫ్రీడం కి సంబంధించి అమెరికాను చైనా హెచ్చరించడం ఇది రెండో సారి. తమ ఈ-మెయిల్ ఎకౌంట్లలోకి కొన్నింటిని చైనా హ్యాకర్లు జొరబడ్డారంటూ గూగుల్ 2010 సంవత్సరంలో చైనా ప్రభుత్వంతో తలపడినపుడు గూగుల్ కు మద్దతుగా అమెరికా ముందుకొచ్చింది. అమెరికా ‘సెక్రటరీ ఆఫ్ స్టేట్’ హిల్లరీ క్లింటన్ గూగుల్ పై నిబంధనలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ…