పోటీ పేరుతో డేటా చౌర్యం, గూగుల్ అతి తెలివి
‘స్ట్రీట్ వ్యూ’ కార్ల ద్వారా పశ్చిమ దేశాలలో పౌరుల వివరాలు అనుమతి లేకుండా సంపాదించి విచారణ ఎదుర్కొంటున్న గూగుల్ కంపెనీ భారత దేశ వివరాలు సంపాదించడానికి ‘మేపధాన్’ పోటీని ఎరగా వేసింది. ప్రత్యక్షంగా తాను డేటా సేకరించడం ‘చౌర్యం’ కిందికి రావడంతో అమాయక వినియోగదారులను అడ్డం పెట్టుకుని సృజనాత్మక పద్ధతుల్లో ‘డేటా చౌర్యానికి’ గూగుల్ పూనుకుంది. గూగుల్ అతి తెలివిని పసిగట్టిన బి.జె.పి ఎం.పిలు ఫిర్యాదు చేయడంతో, అధికారిక ‘రాజకీయ భౌగోళిక మేప్ ల నిర్వహణకు’ బాధ్యురాలయిన…

