గూగుల్ ఇన్నాళ్లూ గుప్తంగా ఉంచిన డేటా సెంటర్స్ ఇవే -ఫోటోలు
వేలాది ఫైబర్ మైళ్ళు, మరిన్ని వేల సర్వర్లతో ఇంటర్నెట్ వినియోగదారుల సర్చింగ్, సర్ఫింగ్ దాహాల్ని తీరుస్తున్న గూగుల్, తన డేటా సెంటర్లను ఇన్నాళ్లూ గుప్తంగా ఉంచింది. పారదర్శకత గురించి తాను చెప్పే నీతులని ప్రదర్శన కోసమైనా పాటించదలిచిందో ఏమో తెలియదు గానీ తన డేటా సెంటర్ల ఫోటోలని గూగుల్ విడుదల చేసింది. వైర్డ్ డాట్ కామ్ ప్రకారం తన అత్యాధునిక ఇన్ఫ్రా స్ట్రక్చర్ సాయంతో రోజుకి 20 బిలియన్ల వెబ్ పేజీ లను గూగుల్ ఇండెక్స్ చేయగలుగుతోంది.…

