హ్యాకింగ్ దాడుల్లో సగం అమెరికా నుండి వస్తున్నవే -చైనా

2013 సంవత్సరంలో చైనా దేశం పైన జరిగిన హ్యాకింగ్ దాడుల్లో సగానికి పైన అమెరికానుండి వచ్చినవేనని చైనా ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా ను ఉటంకిస్తూ రాయిటర్స్ ఆదివారం తెలిపింది. అమెరికాతో పాటు ప్రపంచంలో జరుగుతున్న ఇంటర్నెట్ హ్యాకింగ్ దాడులకు షాంఘై లోని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కి చెందిన ఒక భవంతి ప్రధాన కేంద్రంగా ఉందంటూ అమెరికా సైబర్ కంపెనీ ‘మాండియంట్‘ ఒక నివేదిక వెలువరించిన మూడు…

నష్ట పోతావ్! గూగుల్‌కి చైనా అధికార పత్రిక హెచ్చరిక

చైనా ప్రభుత్వంపై పరోక్షంగా హేకింగ్ ఆరోపణలు సంధించిన గూగుల్ సంస్ధకు చైనా ప్రభుత్వం తన అధికారిక పత్రిక ద్వారా స్పందించింది. అమెరికా, చైనాల మధ్య ఉన్న రాజకీయ విభేధాలను స్వప్రయోజనాలకు వినియోగించుకోవలని చూస్తే “నష్టపోతావ్!” అని పీపుల్స్ డైలీ పత్రిక హెచ్చరించింది. విదేశాల్లో పంపిణీకి వెలువడే పీపుల్సు డైలీ పత్రిక మొదటి పేజీలో రాసిన సంపాదకీయంలో ఈ హెచ్చరిక చేసింది. తన ఆరోపణల ద్వారా గూగుల్ తన వ్యాపారావకాశాలకు ప్రమాదం తెచ్చుకుంటోందని పత్రిక హెచ్చరించింది. గూగుల్ ఈ…

గూగుల్ చైనాల మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం

గత సంవత్సరం చైనానుండి గూగుల్ తన వ్యాపారాన్ని ఉపసంహరించుకున్నంత పని చేసిన గూగుల్ చైనా ప్రభుత్వంతో తన ప్రచ్ఛన్న యుద్ధాన్ని కొనసాగిస్తోంది. గత సంవత్సరంలో వలే నేరుగా చైనా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపనప్పటికీ గూగుల్‌కి చెందిన జి-మెయిల్ ఎకౌంట్ల ఐ.డి లను పాస్ వర్డ్ లను దొంగిలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతూ ఇవి చైనా లోని జినాన్ నుండి జరుగుతున్నట్లుగా అనుమానం వ్యక్తం చేసింది. ఫిషింగ్ ప్రక్రియ ద్వారా జిమెయిల్ వినియోగదారుల ఐ.డి, పాస్ వర్డులను సంపాదించి…

జీ-మెయిల్ సర్వీసును చైనా ప్రభుత్వం అడ్డగిస్తోంది -గూగుల్

తమ ఈ-మెయిల్ సర్వీసుకు చైనా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని గూగుల్ సంస్ధ ఆరోపించింది. ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లొ లాగా చైనా ప్రదర్శనలు నిర్వహించాలన్న సందేశాలు వ్యాప్తి చెందుతున్నందు వలన చైనా ప్రభుత్వం జీ-మెయిల్ సర్వీసుకు ఆటంకాలు సృష్టిస్తోందని జీ-మెయిల్ వినియోగదారులు చెప్పినట్లు బిబిసి తెలిపింది. గత కొద్ది వారాలుగా చైనా అధికారులు గూగుల్ మెయిల్ సర్వీసు వినియోగించకుండా ఆటంకాలు సృష్టిస్తూ జీ-మెయిల్ సాఫ్ట్ వేర్ లోనే ఏదో సమస్య ఉందని భావించేలా చేస్తోందని గూగుల్ తన ఆరోపణలను…